సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 12:06:35

కోవిడ్ 19 రిపోర్ట్ షేర్ చేసిన ప్ర‌ముఖ న‌టుడు

కోవిడ్ 19 రిపోర్ట్ షేర్ చేసిన ప్ర‌ముఖ న‌టుడు

మలయాళ సినీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లెస్సీ తో పాటు 58 మంది ఆదుజీవితం చిత్ర బృందం లాక్‌డౌన్  కార‌ణంగా జోర్డాన్‌లో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల వారంద‌రిని ప్ర‌త్యే ఫ్లైట్ ద్వారా ఇండియాకి తీసుకొచ్చారు. జోర్డాన్‌లో క‌రోనా ఉదృతి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో వీరంద‌రిని క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా పృథ్వీరాజ్ కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అని తేలింది.

కోవిడ్ 19 రిపోర్ట్‌ని పృథ్వీరాజ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ.. ఇంటికి వ‌చ్చే ముందు కంప్లీట్‌గా క్వారంటైన్‌లో ఉన్నాం. మీరు ఇంటి ప‌ట్టున ఉండండి. జాగ్ర‌త్త‌లు వ‌హించండి అని కామెంట్ పెట్టాడు. త‌న అభిమాన న‌టుడికి కోవిడ్ 19 రిపోర్ట్స్ నెగెటివ్ రావ‌డంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.  


logo