Prime show Entertainment | హనుమాన్ సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ హౌజ్‌గా కొనసాగుతున్న ఈ బ్యానర్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 2 సినిమా అనౌన్స్మెంట్ ఉండబోతుందని తెలియజేసింది.
కింగ్ టేకోవర్ చేసే సమయం.. ఎక్జయిటింగ్ పాన్ ఇండియా సినిమా కోసం బ్లాక్ బస్టర్ కాంబో రాబోతుంది. రేపు కింగ్ సైజ్ ప్రకటన ఉండబోతుందని తెలియజేస్తూ.. సింహం బొమ్మ ఉన్న పేక ముక్కలతో డిజైన్ చేసిన పోస్టర్‌ను షేర్ చేశారు. ఇదే రోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో మరి ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ నుంచి రాబోయే కొత్త న్యూస్ పవన్ కల్యాణ్‌కు సంబంధించింది అయి ఉంటుందా.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
సాయిధరమ్ తేజ్ ఇప్పటికే రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మరి తాజా ప్రకటన ఈ సినిమా గురించే అయి ఉంటుందా..? అనేది తెలియాల్సి ఉంది.
Rajinikanth | నా ప్రియమైన సోదరుడు బాలకృష్ణకు అభినందనలు: రజినీకాంత్
Deepika Padukone | దీపికా పదుకొనే ఖాతాలో మరో ఖరీదైన విల్లా.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
Nayan Sarika | సౌతిండియన్ను కాదని తెలిసి అల్లు అర్జున్ షాకయ్యారు.. ఆయ్ భామ నయన్ సారిక
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ