Andhagan | తమిళంలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న నటుడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రశాంత్ (Prashanth). తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని ఈ యాక్టర్ కొంతకాలంగా సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. చాలా రోజుల తర్వాత ప్రశాంత్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం అంధగన్ (Andhagan). త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 9నే విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ కూడా షేర్ చేయగా.. ప్రశాంత్ అంధుడి పాత్రలో చేతిలో కర్ర పట్టుకుని కనిపిస్తు్న్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
మరో రెండు రోజుల్లో సినిమా రాబోతుందంటూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. తాజా పోస్టర్లో లీడ్ యాక్టర్లు ప్రశాంత్, సిమ్రాన్, ప్రియా ఆనంద్, సముద్రఖనిని చూడొచ్చు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రశాంత్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. బిగ్ స్క్రీన్‌పై మరిచిపోలేని ప్రయాణాన్ని ఆస్వాదించడానికి రెడీగా ఉండండి అంటోంది ప్రశాంత్ టీం. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్ అంధగన్ యాంథెమ్ సాంగ్‌కే మంచి స్పందన వస్తోంది.
క్రైం థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో సిమ్రన్, ప్రియా ఆనంద్, కార్తీక్, సముద్రఖని, యోగిబాబు, కేఎస్ రవికుమార్, ఊర్వశి, కార్తీక్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ దీంతోపాటు దళపతి విజయ్ నటిస్తోన్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్‌లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
2 DAYS TO GO!!… #Andhagan will be coming to the Big Screens from August 09th #AndhaganfromAug9th #Andhagan #AndhaganfromAug09th@actorthiagaraja @actorprashanth @SimranbaggaOffc @PriyaAnand @thondankani @iYogiBabu #Andhagan @sidsriram @Music_Santhosh @Lyricist_Vivek… pic.twitter.com/xA9xQAOSEn
— Prashanth (@actorprashanth) August 7, 2024
Mr Bachchan | రవితేజ స్టైలిష్ వార్నింగ్.. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ న్యూ లుక్
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!
అంధగన్ యాంథెమ్ సాంగ్..