Mokshagnya | నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (Mokshagnya)ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నాడు.ది లయన్ కింగ్‌లోని ఓ ఫొటోను షేర్ చేస్తూ #SimbaisComingను జోడించాడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రకటించబోతున్నాడని వచ్చిన వార్తలే నిజమయ్యాయి.
మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. లుక్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్ లుక్‌ను విడుదల చేశారు. జీన్స్ అండ్ బ్లాక్ హుడీ వేసుకొని సూపర్ చామింగ్ లుక్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటో నెట్టింటిని షేక్ చేస్తోంది. ప్రశాంత్ వర్మ లాంఛింగ్ టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయేలా గ్రాండ్‌గా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. తొలి సినిమాలోనే సూపర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ అభిమానులను ఇంప్రెస్ చేయడం పక్కా అని తాజా స్టిల్‌తో చెప్పకనే చెబుతున్నాడు.
ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నట్టు లెజెండ్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. భారత ఇతిహాసం ఆధారంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో ఉండబోతున్నట్టు సమాచారం. మోక్షజ్ఞ ఈ సోషియా ఫాంటసీ సినిమా కోసం అవసరమైన అన్ని రకాల శిక్షణలు పూర్తి చేసుకున్నాడని ఇన్సైడ్ టాక్.
From the ancient realms of Indian Itihasas, Emerges a new Superhero in @ThePVCU ❤️🔥@SLVCinemasOffl & @LegendProdOffl Proudly Introducing @MokshNandamuri to the world cinema in a Mythological Action Entertainer 💥
Happy Birthday MOKSHU ❤️
Directed by @PrasanthVarma
Produced by… pic.twitter.com/FPe5Mk5tJQ— SLV Cinemas (@SLVCinemasOffl) September 6, 2024
Dil Raju | థంపింగ్ రెస్పాన్స్.. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రపై దిల్ రాజు
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ ఫ్యామిలీ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..!
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే