Andhagan | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటుడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రశాంత్ (Prashanth). సపోర్టింగ్ రోల్స్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రశాంత్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ అంధగన్ (Andhagan). త్యాగరాజన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ప్రీపోన్ చేస్తున్నట్టు తెలిపారు. అంధగన్ను ఆగస్టు 9నే రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ షేర్ చేశారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మేకర్స్. ఇందులో భాగంగా లాంచ్ చేసిన కొత్త పోస్టర్లో ప్రశాంత్ అంధుడి పాత్రలో చేతిలో కర్ర పట్టుకుని కనిపిస్తున్నాడు. బిగ్ స్క్రీన్‌పై మరిచిపోలేని ప్రయాణాన్ని ఆస్వాదించడానికి రెడీగా ఉండండి అంటూ ట్వీట్ చేశాడు ప్రశాంత్. ఇప్పటికే ఈ మూవీ నుంచి కోస్టార్ విజయ్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ అంధగన్ యాంథెమ్ సాంగ్‌కే మంచి స్పందన వస్తోంది.
క్రైం థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో సిమ్రన్, ప్రియా ఆనంద్, కార్తీక్, సముద్రఖని, యోగిబాబు, కేఎస్ రవికుమార్, ఊర్వశి, కార్తీక్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ మరోవైపు దళపతి విజయ్ నటిస్తోన్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్‌లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
#Andhagan in theatres from August 9th..
Very good decision to prepone d movie by one week from previously announced August 15th date.. pic.twitter.com/E0DrMSp3fx— Naganathan (@Nn84Naganatha) July 31, 2024
Double iSmart | మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో రామ్ డబ్బింగ్
Game Changer | బర్త్ డే గాళ్ కియారా అద్వానీకి శుభాకాంక్షలు.. ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ నయా లుక్
They Call Him OG | ఏంటీ పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం వచ్చేసిందా..? ఓజీ షూట్‌పై క్రేజీ న్యూస్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
అంధగన్ యాంథెమ్ సాంగ్..