Pragya Jaiswal | రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal).. ఈ ఇద్దరు భామల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో టాప్ యాక్టర్లతో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్, ప్రగ్యా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మలు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే.
ఇక ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉండే ఇటీవలే కాస్త విరామం తీసుకుని ట్రిప్ వేశారు. ఇంతకీ వీళ్లిద్దరూ ఎక్కడికెళ్లారనే కదా మీ డౌటు. ఇటీవలే ఇద్దరూ కలిసి లండన్ వెకేషన్‌కు వెళ్లారు. నా బెస్ట్ బంచ్‌తో బెస్ట్ సిటీకి. గుడ్‌బై లండన్.. మీరు ఆతిథ్యం అపూర్వం.. అంటూ ప్రగ్యాజైశ్వాల్ ట్రిప్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నారు. తమకిష్టమైన ఆహారాన్ని ఎంజాయ్ చేశారు. ప్రగ్యాజైశ్వాల్ అంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో సందడి చేసింది. ప్రగ్యా జైశ్వాల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్