Prabhudheva | ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా (Prabhudheva) 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య హిమానీ సింగ్ (Himani Singh) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రభుదేవా సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
‘అవును! ఇది నిజం! నేను ఈ వయసులో (50) మళ్లీ తండ్రిని అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే నా పనిభారాన్ని చాలా వరకు తగ్గించుకున్నాను. ఇప్పుడు నేను నా కుటుంబంతో గడపాలని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రభుదేవా తోటి డ్యాన్సర్ అయిన రామలతను 1995లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు విశాల్, రిషి రాఘవేంద్ర దేవ, అదితి దేవ జన్మించారు. వీరిలో విశాల్ 2008లో మరణించాడు. అనంతరం 2010లో ప్రభుదేవా-రామలత విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రభుదేవా ముంబై ఫిజియోథెరపిస్ట్ అయిన హిమానీ సింగ్ తో ప్రేమలో పడ్డాడు. ఈ జంట 2020లో వివాహం చేసుకుంది. పెళ్లైన మూడేళ్ల తర్వాత హిమానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Also Read..
CoWin | దేశంలో మరో మేజర్ డేటా లీక్..! టెలీగ్రామ్‌లో ప్రముఖల వివరాలు..!
Virat Kohli | కోహ్లీ పండ్ల విక్రయదారుడైతే..? విరాట్ మల్టీవర్స్ పిక్స్ వైరల్