Donald Trump | నాపై ఆరోపణలు నిరాధారం.. శిక్ష పడినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తా : ట్రంప్
Donald Trump | తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా, తనకు శిక్ష పడినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తేల్చి చెప్పారు.
Donald Trump | తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా, తనకు శిక్ష పడినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష రేసులో నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలవకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే అధ్యక్ష పదవికి పోటీపడి తీరుతానని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు పెద్ద ఎత్తున అధికారిక పత్రాలను తన ఇంటికి తీసుకెళ్లారన్న అభియోగాలపై ట్రంప్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మంగళవారం ఆయన కోర్టుకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేసు విచారణపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తర కరోలినా, జార్జియాలో నిర్వహించిన రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు.
తమ ఉద్యమాన్ని అణచివేసేందుకే ఒకదాని తర్వాత మరో విచారణ చేపడుతున్నారని అన్నారు. తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా విడిచిపెట్టబోనన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. తాను రిపబ్లికన్ను కావడం వల్లే వేధిస్తున్నారని, తనపై విచారణ తంతు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని ట్రంప్ అన్నారు.
Also Read..
Cyclone Biparjoy | ముంబై ఎయిర్‌పోర్టుపై బిపర్జోయ్ ఎఫెక్ట్.. ప్రయాణికుల ఇబ్బందులు
Warkaris | పూణెలో ఉద్రిక్తత.. వార్కారీ భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

