Raja Saab | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) అభిమానులు, మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం రాజాసాబ్ (raja saab). హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ పోస్టర్ విడుదల చేశారని తెలిసిందే. రాజసం ఆయన బ్లడ్‌లోనే ఉంది.
వివాదరహితుడైన పాలనాదక్షుడు 2025 ఏప్రిల్ 10న వస్తున్నాడు.. అంటూ విడుదల చేసిన మోషన్ పోస్టర్లో రాజసం ఉట్టి పడే రాయల్ లుక్‌లో కొంచెం చమత్కారంగా, కొంచెం భయానకంగా కనిపిస్తున్న రాజాసాబ్ స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
రాజాసాబ్ మోషన్ పోస్టర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లో 8.3 మిలియన్ల వ్యూస్ రాబట్టి నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రభాస్ మేనియా ఎలా ఉందో ఈ ఒక్క అప్డేట్తో అర్థమవుతోంది.
రాజాసాబ్‌లో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే షేర్ చేసిన రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న సీన్లు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
The Raja’s arrival shatters every limit and sets a new standard 😎#TheRajaSaab Motion Poster hits a RECORD-BREAKING 𝟴.𝟯 𝗠𝗜𝗟𝗟𝗜𝗢𝗡+ 𝗩𝗜𝗘𝗪𝗦 and 𝗧𝗥𝗘𝗡𝗗𝗜𝗡𝗚 #𝟭 on YouTube in 24 hours 🔥#RecordBreakingRajaSaab 👑https://t.co/KtuBsjZeuJ#Prabhas… pic.twitter.com/g55BEgbHXh
— BA Raju’s Team (@baraju_SuperHit) October 24, 2024
రాజాసాబ్ మోషన్ పోస్టర్..
Game Changer Teaser | రాంచరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ టైం ఫిక్సయినట్టేనా..?
Sonam Kapoor | నీరవ్ మోదీ స్టోర్‌ను భారీ మొత్తానికి కొన్న సోనమ్ కపూర్
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్