Power star Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఆయన ఎన్ని సినిమాలు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒకవైపు రాజకీయాలు చేస్తూ.. మరోవైపు సినిమాలు కూడా చేయాలని చూస్తున్నాడు జనసేనాని. కానీ జనసేన పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో సినిమాలకు వస్తాడు అనుకోవడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఎన్నికలు మరో ఏడాదిన్నరలోనే వస్తున్నాయి కాబట్టి.. వాటి గురించి ఆలోచిస్తున్నాడు పవర్ స్టార్. మరో రెండు మూడు నెలల వరకు ఈయన సినిమా షూటింగ్స్ వైపు చూడకపోవచ్చు అనేది సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
కేవలం రాజకీయాలతోనే బిజీగా ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. అందుకే ఒప్పుకున్న సినిమాలను కూడా పక్కన పెడుతున్నాడు ఈయన. కాకపోతే ఈ సినిమాలను కచ్చితంగా పూర్తి చేస్తాడు అయితే.. అది ఎప్పుడో మాత్రం క్లారిటీ లేదు. దాంతో పవన్ సినిమాల లిస్టులో కమిట్ అయిన వాళ్ళు కంగారుపడుతున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. దీని షూటింగ్ దాదాపు 70% పూర్తయింది. సమ్మర్ 2023లో సినిమా విడుదల చేస్తామని తాజాగా అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు.
మరోవైపు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇక సురేందర్ రెడ్డి సినిమా ఆగిపోయింది అని అంతా ప్రచారం జరుగుతున్న వేళ.. లేదు ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాడు నిర్మాత రామ్ తాలూరి. ఏజెంట్ పూర్తయిన తర్వాత పవన్, సురేందర్ రెడ్డి సినిమా మొదలవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు. అన్ని సినిమాలు ఉన్నాయి అని చెప్తున్నారు.. కానీ అవి ఎప్పటికి పూర్తి అవుతాయి అనే విషయం మాత్రం ఎవరూ చెప్పడం లేదు. దాంతో పవన్ అభిమానులకు ఎదురుచూపులు తప్ప ఇంకేమీ మిగలడం లేదు.
“Jalsa Movie | ‘జల్సా’ రీ-రిలీజ్‌తో రికార్డు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్”