Jalsa Movie | ‘జల్సా’ రీ-రిలీజ్‌తో రికార్డు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్
Jalsa Movie Record | పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న ‘జల్సా’, ‘తమ్ముడు’ చిత్రాలు రి-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. థియేటర్లలో పవర్‌స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఏ స్థాయిలో సంబురాలు చేస్తారో, ఈ రెండు సినిమాలకు కూడా అదే స్థాయిలో పవన్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా జల్సా సినిమా రిలీజ్ అయింది. దాదాపు 700లకు పైగా స్క్రీన్లలో విడుదలై పోకిరి రికార్డును చెరిపివేసింది. తమ్మడు తక్కువ స్క్రీన్లలో విడుదల కాగా.. జల్సా భారీ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. ముఖ్యంగా జల్సా సినిమాకు విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
జల్సా మూవీ స్పెషల్ షోస్‌కు దాదాపు రూ.2.85కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఒక రి-రిలీజ్ మూవీకి ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయంటే విశేషం అనే చెప్పాలి. ఇక దీన్ని బట్టి చూస్తే పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008లో విడుదలైన జల్సా చిత్రం పవన్ ఫ్లాప్‌లకు బ్రేక్ వేసింది. త్రివిక్రమ్ టేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, పవన్ పర్ఫార్మెన్స్ సినిమాను బిగ్గెస్ట్ హిట్‌గా చేశాయి. అప్పట్లో వెయ్యి స్క్రీన్లలో విడుదలైన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా టాలీవుడ్‌కు ఫస్ట్‌లుక్ కాన్సెప్ట్‌ను పరిచయం అయింది కూడా ఈ చిత్రంతోనే. కేవలం విజయవాడలోనే రిలీజ్ డే రోజు లక్ష మందికి పైగా సినిమాను వీక్షించిన ఘనత జాల్సా మూవీ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఆ రికార్డు ఇంకా అలానే ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jalsa Movie
- Pawan Kalyan
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

