Pawan Kalyan | వెయిటింగ్ మూడ్‌లో పవన్‌కల్యాణ్..షూట్‌పై క్లారిటీ వచ్చేనా..?
గత నెలలో అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం కోలుకున్నాడు. అత్వరలోనే పవన్ కల్యాణ్ షూటింగ్‌కు రాబోతున్నాడని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇంకా క్లారిటీ రావడం లేదు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గత నెలలో అస్వస్థతకు గురవడంతో చికిత్స నందించిన డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పారు. వారి సలహాలు, సూచనలు పాటించిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం కోలుకున్నాడు. అయితే త్వరలోనే పవన్ కల్యాణ్ షూటింగ్‌కు రాబోతున్నాడని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ నెలలో వినోధయ సీతమ్ రీమేక్ (Vinodhaya Sitham remake)ను షురూ చేయాల్సి ఉంది.
కానీ ఇప్పటివరకు షూటింగ్ షురూ కాలేదు. పవన్ ఇప్పటికీ సెట్స్‌కు తిరిగి రాకుండా వెయిటింగ్ మూడ్‌లో ఉన్నారని టాలీవుడ్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకీ పవన్ సెట్స్ లో ఎప్పుడు కనిపిస్తాడనేది కూడా సస్పెన్స్ గా మారింది. అంతేకాదు ఒకవేళ చిత్రీకరణ మొదలుపెడితే వినోధయ సీతమ్ రీమేక్ మొదలుపెడతాడా..? లేదంటే హరిహరవీరమల్లును (Hari Hara Veera Mallu) సెట్స్ లో తిరిగి జాయిన్ అవుతాడా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
మరి రానున్న రోజుల్లోనైనా పవన్ కాంపౌండ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. పవన్ కల్యాణ్ మరోవైపు ఈ రెండు సినిమాలు పూర్తి చేసి..దసరా నుంచి పొలిటికన్ ప్లాన్ లో భాగంగా ఏపీలో బస్సు యాత్ర చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో షూటింగ్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

