పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇక 1998లో వచ్చిన ‘తొలిప్రేమ’ పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌కు మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వరుసగా ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’ ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బాస్టర్లు కావడంతో పవన్ ఒక్కసారిగా సౌత్‌లో సెన్సేషన్ అయ్యాడు. ఈ మూడు చిత్రాలతో పవన్ కళ్యాణ్.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
హ్యట్రిక్ హిట్ల తర్వాత పవన్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత దాదాపు 5ఏళ్ళ వరకు పవన్‌కు మరో హిట్ పడలేదు. వరుసగా 5సినిమాలు ఫ్లాప్ అవడంతో ఒక్కసారిగా పవన్ గ్రాఫ్ పడిపోయింది. ఈ క్రమంలో ‘జల్సా’ చిత్రం పవన్ ఫ్యాన్స్‌కు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. వరుసగా మూడు ఫ్లాప్‌లు. ఈ సారి పపన్ పని అయిపోయింది అని భావించారు. ఇక అప్పుడే ‘గబ్బర్‌సింగ్’ అంటూ పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు. 2012లో విడుదలైన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. దాదాపు 150కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేసి సౌత్‌లో హైయెస్ట్ గ్రాసర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం తర్వాత తివిక్రమ్‌తో మరోసారి చేతులు కలిపి ‘అత్తారింటికి దారేది’ సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించి పవన్ గ్రాఫ్‌ను అమాంతం పెంచింది. ఈ చిత్రం తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో మరో విజయం సాధించలేకపోయాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కేవలం నటుడిగానే కాకుండా సింగర్ గాను తన సినిమాల్లో పాటలు పడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన పాడిన పాటలేంటో ఒకసారి చూద్ధాం
తమ్ముడు:
మొదటి సారి పవన్ తమ్ముడు సినిమాలో ‘తాటీ చెట్టు’, ‘ఏం పిల్ల అంటూ’ సాగే బిట్ సాంగ్స్‌ను పాడాడు.
ఖుషి:
‘బయ్ బయ్యే బంగారు రమణమ్మ’ అంటూ సాగే బిట్ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాలో ఆలపించాడు. అప్పట్లో ఈ పాట సెన్సేషనల్ అయింది.
జానీ:
జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు పాటలను పాడాడు. అందులో ఒకటి బిట్ సాంగ్ కాగా.. మరోటి ఫుల్సాంగ్. ఎమ్మెస్ నారాయణ తాగుడు గురించి సెటైరికల్‌గా పాడిన ‘నువ్వు సారా తాగకు’ పాట అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోనే ‘రావోయి మా ఇంటికి’ పాటను కూడా పవన్ ఆలపించాడు.
గుడుంబా శంకర్:
పవన్ పాడిన పాటలకు మంచి గుర్తింపు రావడంతో గుడుంబా శంకర్‌లో ‘కిల్లి కిల్లి’ అంటూ సాగే పెప్పీ నెంబర్‌ను మేకర్స్ పవన్‌తో పాడించారు. ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
పంజా:
గుడుండా శంకర్ తర్వాత దాదాపు ఏడేళ్ళ వరకు ఏ పాట పాడలేదు. కాగా పంజా సినిమాతో సింగర్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. పంజాలో బ్రహ్మానందంతో కలిసి ‘పాపారాయుడు’ అంటూ హూషారుగా సాగే గీతాన్ని ఆలపించాడు.
అత్తారింటికి దారేది:
ఈ చిత్రంలో ‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా’ అనే సాంగ్‌ను పాడాడు. ఈ పాట సినిమాకే హైలేట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఈ ఒక్క పాటతోనే విడుదలకు ముందు విపరీతమైన బజ్ ఏర్పడించింది.
అజ్ఞాతవాసి:
అత్తారింటి దారేది తర్వాత ఐదేళ్ళకు మళ్ళీ అదే కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసిలో ‘కొడక కోటేశ్వరరావు’ అనే పాటను ఆలపించాడు. ఈ సినిమా రిలీజ్ టైంకు ఈ పాట ఒక సెన్సేషన్ అయింది. అంతేకాకుండా ఈ పాటతో మేకర్స్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నారు. కొటేశ్వరరావు అనే పేరుతో ఉన్న వారిని ఈ పాట కించపరిచిందని పలువురు కంప్లైంట్ చేశారు.
ఇలా పవన్ తన సినిమాల కోసం పలు పాటలను కూడా పాడాడు.