ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja). వీటిలో త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్న ధమాకా (Dhamaka) ఒకటి. పెళ్లి సందD ఫేం శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ ప్రాజెక్టులో జాతిరత్నాలు చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించిన ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)కూడా మెరవబోతున్న విషయం తెలిసిందే. ఫరియా ఫీ మేల్ లీడ్ రోల్ అని టాక్ కూడా వచ్చింది. అయితే తాజాగా ఓ క్రేజీ గాసిప్ బయటకు వచ్చింది.
ఈ మూవీలో రవితేజ సోదరి పాత్రలో ఫరియా కనిపించబోతుందన్న వార్త ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ అప్డేట్ ప్రస్తుతానికి గాసిప్లాగే ఉన్నా..ఈ క్రేజీ న్యూస్‌తో సిల్వర్ స్క్రీన్‌పై రవితేజ-ఫరియా అన్నాచెల్లెళ్లుగా ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారని అప్పుడే చర్చించటం మొదలుపెట్టారు సినీ జనాలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ధమాకా చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజర్ కాగా…రామ్-లక్ష్మణ్ (Ram Lakshman) ఫైట్స్ మాస్టర్స్. రవితేజ మరోవైపు డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవతో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న రావణాసుర మూవీలో నటిస్తున్నాడు. తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావుతో నార్తిండియా ప్రేక్షకులను కూడా పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు.
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!
Read Also : Kinnerasani | నేరుగా ఓటీటీలోకి మెగాస్టార్ అల్లుడి సినిమా?
Read Also : #NBK108 | రూట్ మార్చబోతున్న అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో అలాంటి సినిమా చేయనున్నాడట!