Pooja Hegde | చివరగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, సర్కస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది పూజాహెగ్డే (Pooja Hegde). ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ భామ నెక్ట్స్ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న దేవ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ షాహిద్ కపూర్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ డైరెక్టర్ రోషన్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాతో బీటౌన్ ఎంట్రీ ఇస్తున్నాడు రోషన్ మాథ్యూ. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ అందించింది పూజా హెగ్డే. దేవలో తన పార్టుకు సంబంధించి చిత్రీకరణ పూర్తయినట్టు తెలియజేసింది. మా సినిమాలో భాగమైన మీకు, మీ అద్భుతమైన పని తీరుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ శ్రద్ద, జ్ఞానం సెట్‌కు జీవం పోసింది. ఈ విషయం సినిమాలో కనిపించనుంది. ఎప్పుడూ మెస్మరైజ్ చేస్తూ ఉండాలని.. ప్రేమతో.. అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది దేవ టీం.
The song #BhasadMacha schedule wrapped up on the sets of movie #Deva starring #ShahidKapoor and #PoojaHegde. Can’t wait for the song seeing Shahid Kapoor dancing.
Find more: https://t.co/9cD9dOe1rk#Bollywood #Movie #Indianmen #MumbaiPolice #Mumbai pic.twitter.com/Wy2g0BrEIi— ShahidKapoor (@shahidkapoorinf) September 4, 2024
Ram charan | వరద బాధితులకు సపోర్టుగా.. రాంచరణ్, వైజయంతీ మూవీస్ భారీ విరాళం
Nani | టాలీవుడ్ అమీర్ ఖాన్ ప్రియదర్శి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నాని కామెంట్స్