Mohan Babu | టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబసభ్యుల మధ్య వార్ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మీడియాపై మోహన్ బాబు (Mohan Babu) దాడి కేసు సర్వత్రా చర్చనీయాంశమవడమే కాకుండా ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనలో మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది.
తాజాగా ఈ కేసులో పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఆయన ఆయుధాన్ని కూడా సీజ్ చేయనున్నారు. ఈ మేరకు పోలీసులు కాసేపట్లో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళనున్నారు. జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలో మొదట ఆయనపై బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి.. హత్యాయత్నం కేసుగా మార్చారు.
మోహన్ బాబు క్షమాపణలు..
దాడి ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ సోదరుడు గాయపడటం నాకు బాధ కలిగించింది. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయా. ఆ రోజు నా ఇంటిగేటు విగిరిపోయింది.. దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని.. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లు లేఖలో వివరించారు.
పరిస్థితి అదుపు చేసే క్రమంలో జర్నలిస్ట్‌కు గాయమైందని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. అతడికి, ఆయన కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు. గాయపడ్డ జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని మోహన్‌బాబు కాంక్షించారు.
Satyadev | బ్రతికిపోయాం.. ముఫాసా ది లయన్ కింగ్‌లో టాకాకు సత్యదేవ్ వాయిస్
Coolie | తలైవా బర్త్ డే స్పెషల్.. కూలీ షూట్ లొకేషన్లో ఉపేంద్ర, అమీర్‌ఖాన్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!