Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master )పై ఇప్పటికే పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నార్సింగి పోలీసులు బాధితురాలి నుంచి ఇప్పటికే స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. మరోవైపు పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలింపు కూడా ముమ్మరం చేశారు.
తాజాగా జానీమాస్టర్ లడఖ్‌లో ఉన్నట్టు పోలీసులకు సమాచారమందడంతో ప్రత్యేక పోలీస్ బృందాలు లడఖ్‌కు బయలుదేరినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్‌ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చని సమాచారం. కాగా ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇప్పటికే నార్సింగి పోలీసులు బాధితురాలి ఇంట్లోనే విచారించి వివరాలు సేకరించారు. మరిన్ని ఆధారాలు సేకరించడంలో భాగంగా పోలీసులు ఇవాళ బాధితురాలి ఇంటికి మరోసారి వెళ్లనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. సెక్స్ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని..తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని, పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్లో పేర్కొంది.
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్