WTC Final | బాలీవుడ్ స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు లండన్ (London)లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final)లో కాబోయే కొత్త జంట మెరిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కొంత కాలంగా డేటింగ్లో ఉన్న రాఘవ్-పరిణీతి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 13వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాజీవ్ చౌక్‌లోని కపుర్తాల హౌస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వేడుక జరిపించారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
లండన్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read..
Mukesh Ambani | ముకేశ్ అంబానీ మనవరాలి పేరేంటో తెలుసా..?
Starbucks | స్టార్‌బక్స్‌లో కూర్చొని.. రూ.400 కాఫీని రూ.190కే తాగాడు.. ఎలా అంటే..?
AI-generated images | ట్రంప్ టు ఒబామా.. ప్రముఖులు చిన్నారులైతే ఇలా ఉంటారు..!