Starbucks | యూఎస్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ (Starbucks ) గురించి తెలియని వారు ఉండరు. ఇందులో కాఫీ తాగితే ఆ టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి. అయితే, దాని ఖరీదు కూడా చాలా ఎక్కువే. ఇందులో సాధారణ కాఫీ ధరే రూ.300 నుంచి రూ.400 వరకు ఉంటుంది. అయినా సరే కొందరు ఆ టేస్ట్‌ను వదులుకోలేక ఎంత ఖరీదైనా సరే స్టార్‌బక్స్‌కు వెళ్లి కాఫీ తాగుతుంటారు. అయితే తక్కువ ధరకు స్టార్‌బక్స్ కాఫీ తాగాలంటే ఏం చేయాలో సందీప్ మాల్ అనే వ్యక్తి తెలియజేశాడు. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన కథనాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.
స్టార్‌బక్స్‌కు వెళ్లిన సందీప్ రూ.400 ఖరీదైన కాఫీని కేవలం రూ.190కే తాగాడు. ఇందుకోసం అతడు ఫుడ్ డెలివరీ యాప్‌ను ఉపయోగించుకున్నాడు. అది కూడా స్టార్‌బక్స్ షాప్‌లో కూర్చొనే. స్విగ్గీ, జొమాటో (Zomato) వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో అప్పుడప్పుడు ఆర్డర్లపై ఆఫర్లు వస్తుంటాయన్న విషయం తెలిసిందే. అలాంటి ఆఫర్ సాయంతో జొమాటో నుంచి స్టార్‌బక్స్ కాఫీని ఆర్డర్ చేశాడు సందీప్. డిస్కౌంట్ పోను రూ.400 కాఫీ.. రూ.190కే వచ్చింది. డెలివరీ బాయ్ స్టార్‌బక్స్ కేఫ్‌కు వచ్చి కాఫీని డెలివరీ తీసుకొని అక్కడే టేబుల్ వద్ద కూర్చున్న సందీప్‌కు ఇచ్చి వెళ్లిపోయాడు. ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా అవడంతోపాటుగా, కేఫ్‌లోని ఆర్డర్ కౌంటర్ వద్దకు వెళ్లడం వల్ల కలిగే అసౌకర్యాన్ని కూడా నివారించుకోవచ్చని సందీప్ అభిప్రాయపడ్డాడు.
Also Read..
AI-generated images | ట్రంప్ టు ఒబామా.. ప్రముఖులు చిన్నారులైతే ఇలా ఉంటారు..!
Mukesh Ambani | ముకేశ్ అంబానీ మనవరాలి పేరేంటో తెలుసా..?
Amazon Forest | ఇదో అద్భుతం.. అమెజాన్ అడవుల్లో విమానం కూలిన 40 రోజుల తర్వాత సజీవంగా చిన్నారులు