Amazon Forest | ఇదో అద్భుతం.. అమెజాన్ అడవుల్లో విమానం కూలిన 40 రోజుల తర్వాత సజీవంగా చిన్నారులు
Amazon Forest | దక్షిణ అమెరికాలోని కొలంబియా (Colombia) లో గల అమెజాన్ అడవుల్లో (Amazon Forest) అద్భుతం జరిగింది. 40 రోజుల క్రితం తప్పిపోయిన నలుగురు చిన్నారులు సజీవంగా కనిపించారు.
Amazon Forest | దక్షిణ అమెరికాలోని కొలంబియా (Colombia) లో గల అమెజాన్ అడవుల్లో (Amazon Forest) అద్భుతం జరిగింది. 40 రోజుల క్రితం తప్పిపోయిన నలుగురు చిన్నారులు సజీవంగా కనిపించారు. వివరాల్లోకి వెళితే..
అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే 1వ తేదీన ఓ విమానం బయలుదేరింది. అందులో పైలట్, గైడ్ సహా నలుగురు చిన్నారులు, వారి తల్లి ఉన్నారు. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా అమెజాన్ అడవిలో కూలిపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు ‘ఆపరేషన్ హోప్’ పేరుతో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16వ తేదీన విమాన శకలాలను గుర్తించారు. అందులో పైలట్,చిన్నారుల తల్లి, గైడ్ మృతదేహాలు కనిపించాయి.
వారితోపాటు విమానంలో ప్రయాణించిన 13, 9, 4, ఏళ్ల చిన్నారులతోపాటు 11 నెలల పసిబిడ్డ ఆచూకీ మాత్రం వారికి కనిపించలేదు. దీంతో వారి కోసం దట్టమైన అడవుల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. దాదాపు 150 మంది సైనికులు అమెజాన్ అడవిని జల్లెడపట్టగా.. మే 18వ తేదీన చిన్నారులు క్షేమంగా ఉన్నట్లు తెలియజేసే కొన్ని ఆధారాలు వారి కంటపడ్డాయి. దీంతో చిన్నారుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత శుక్రవారం చిన్నారులను సజీవంగా గుర్తించారు.
చిన్నారులను సురక్షితంగా గుర్తించిన విషయాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో (Gustavo Petro) తెలిపారు. వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ‘దేశమంతటికీ సంతోషకరమైన వార్త..! 40 రోజుల క్రితం కొలంబియా అడవిలో గల్లంతైన నలుగురు పిల్లలు సజీవంగా కనిపించారు. ఇది చరిత్రలో మిగిలిపోతుంది’ అంటూ పెట్రో సంతోషం వ్యక్తం చేశారు. నిత్యం క్రూరమృగాలు తిరిగి ఈ దట్టమైన అమెజాన్ అడవిలో చిన్నారులు ఇన్ని రోజులు బతికుండటం విశేషం. ఇదో అద్భుతమనే చెప్పాలి.
¡Una alegría para todo el país! Aparecieron con vida los 4 niños que estaban perdidos hace 40 días en la selva colombiana. pic.twitter.com/cvADdLbCpm
— Gustavo Petro (@petrogustavo) June 9, 2023
La alegría es inmensa, el agradecimiento a nuestras @FuerzasMilCol y comunidades indígenas será eterno. Nunca dejamos de buscarlos hasta que el milagro llegó. #OperaciónEsperanza pic.twitter.com/iVWPCOTpYv
— Mindefensa (@mindefensa) June 10, 2023
Also Read..
Biparjoy Cyclone: గుజరాత్ తీరం దిశగా బిపర్జాయ్.. తీతల్ బీచ్ మూసివేత
NH 65 | డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన లారీ.. ఎన్‌హెచ్ 65పై రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

