VarunTej-Lavanya | ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్.. సందడి చేసిన మెగా, అల్లు ఫ్యామిలీలు
VarunTej-Lavanya Tripathi | మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్యల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. గతకొన్నేళ్లుగా ప్రేమలో ఉంటున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
VarunTej-Lavanya Tripathi | మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్యల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. గతకొన్నేళ్లుగా ప్రేమలో ఉంటున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో వీరి ఎంగేజ్మెంట్ శుక్రవారం సాయంత్రం నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలు మాత్రమే ఈ వేడుకలో సందడి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లో జరుగనున్నట్లు తెలుస్తుంది.
ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటుగా ఓ కొత్త దర్శకుడితో ఏయిర్ ఫోర్స్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడు.
ఇక లావణ్య త్రిపాఠి ఇటీవలే పులిమేక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. జీ-5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. గతేడాది హ్యపీ బర్త్ డే సినిమాతో అలరించింది. ప్రస్తుతం ఈ మెగా కోడలు థనల్ అనే తమిళ సినిమా చేస్తుంది. అథర్వ మురళి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రవింద్ర మాధవ దర్శకత్వం వహిస్తున్నాడు.

Found my Lav!♥️@Itslavanya pic.twitter.com/OCyhWcIjMq
— Varun Tej Konidela (@IAmVarunTej) June 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

