Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట ఏం జరిగినా విశేషమే. ప్రస్తుతం ఆ ఇంట్లో సందడి వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ముకేశ్-నీతాల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ (Akash Ambani) – శ్లోకా మెహతా (Shloka Mehta) దంపతులు రెండో సారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా మెహతా ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ బిడ్డకు పేరు పెట్టారు. ఆ చిన్నారికి వేద ఆకాశ్ అంబానీ (Veda Akash Ambani) అని నామకరణం చేసినట్లు అంబానీ కుటుంబం వెల్లడించింది.
ఆకాశ్-శ్లోకా 2019 మార్చిలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ముంబైలో అంగరంగం వైభవంగా జరిగింది. ఈ జంటకు 2020 డిసెంబర్లో కుమారుడు పుట్టాడు. అబ్బాయికి పృథ్వీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కుమారుడి వయసు రెండేళ్లు. ఇప్పుడు రెండోసారి అమ్మాయి పుట్టడంతో ఆ ఇంట పండగ వాతావరణం నెలకొంది.
Also Read..
Amazon Forest | ఇదో అద్భుతం.. అమెజాన్ అడవుల్లో విమానం కూలిన 40 రోజుల తర్వాత సజీవంగా చిన్నారులు
Biparjoy Cyclone: గుజరాత్ తీరం దిశగా బిపర్జాయ్.. తీతల్ బీచ్ మూసివేత