శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 07:00:41

మాల్దీవుల‌లో చిల్ అవుతున్న య‌ష్ ఫ్యామిలీ

మాల్దీవుల‌లో చిల్ అవుతున్న య‌ష్ ఫ్యామిలీ

కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పొందిన రాకింగ్ స్టార్ య‌ష్ ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవుల‌లో చిల్ అవుతున్నాడు. ఇటీవ‌ల త‌న తాజా చిత్రం కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి చేసిన య‌ష్ కాస్త ఉప‌శ‌మ‌నం కోసం భార్య రాధికా పండిట్ కూతురు ఐరా, కొడుకు య‌థ‌ర్వ్‌తో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లాడు. అక్క‌డ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ కాగా, ఆయ‌న  జనవరి 8, 1986 న కర్ణాటకలో జన్మించారు. య‌ష్‌ని ఇప్పుడు అంద‌రు రాఖీ భాయ్ అని, రాకింగ్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. 2008 లో తన భార్య రాధిక పండిట్ సరసన మోగ్గినా మనసు చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు.  2016 లో రాధికాతో య‌ష్‌కు వివాహం కాగా, వారు రీసెంట్‌గా ఓ యాడ్‌లో క‌లిసి న‌టించారు. కేజీయఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్టుకు రూ .15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్,


VIDEOS

logo