దేవదాస్, పోకిరి, కిక్ సినిమాల్లో తన అందం, అభినయం, నటనతో కుర్రకారు గుండెల్ని పిండేసింది ముంబై భామ ఇలియానా (Ileana DCruz). ఆ తర్వాత రాఖీ, జల్సాతోపాటు తెలుగులో చాలా చిత్రాల్లో మెరిసింది. చివరగా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ భామ ప్రస్తుతం హిందీపైనే ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక అప్డేట్తో నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది ఇలియానా.
అయితే ఈ బ్యూటీ కేవలం డేటింగ్ కారణంగానే కత్రినాకైఫ్ (Katrina Kaif) ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలియానా ఈ వేడుకల్లో పాల్గొన్నదని జోరుగా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ బర్త్ డే వేడుకల్లో సందడి చేసింది ఇలియానా. కత్రినాకైఫ్ పుట్టినరోజు వేడుకలు మాల్దీవుల్లో జరిగాయి. బర్త్ డే ఈవెంట్లో కత్రినాకైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ తోపాటు అనుకోని అతిథి కూడా పాల్గొన్నారు. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో ఊహించే ఉంటారు..ఆ భామే ఇలియానా.
కత్రినాకైఫ్ బర్త్‌డే సెలబ్రేషన్ ఫొటో తాజాగా ఓ క్రేజీ వార్తను తెరపైకి తెచ్చింది. అదేంటంటే..ఈ ఫొటోలో ఉన్న ఓ వ్యక్తితో ఇలియానా డేటింగ్లో ఉందట. అవును మీరు చదివింది నిజమే. కత్రినాకైఫ్ సోదరుడు, మోడల్ సెబాస్టియన్ (Sebastian) (ఫొటోలో ఎర్ర చొక్కా వ్యక్తి) ఇల్లీ బేబీ గత 6 నెలలుగా డేటింగ్లో ఉన్నట్టు క్రేజీ అప్ డేట్ ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ప్రస్తుతానికి ఇలియానా గురించి వచ్చిన ఈ వార్త నిజమేనా..? లేదంటే గాసిప్ అనేది పక్కన పెడితే..ఈ క్రేజీ అప్డేట్ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై ఇలియానా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
Read Also : Ritika Singh | ‘ఓ సక్కనోడా..నిన్ను పట్టేసుకుంటా’..రితికాసింగ్ వీడియో వైరల్