Arjun Selfie | సెల్ఫీ స్టిల్‌తో అర్జున్-విశ్వక్సేన్ సినిమా అప్డేట్
యువ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen) యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా (Arjun Sarja) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
రీసెంట్గా అశోకవనంలో అర్జుణ కల్యాణం సినిమాతో మంచి హిట్టు కొట్టాడు టాలీవుడ్ యువ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen). ఈ క్రేజీ యాక్టర్ ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా (Arjun Sarja) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ 11వ (Vishwak Sen 11) చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ (Aishwarya Arjun) హీరోయిన్గా నటిస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇటీవలే కేజీఎఫ్ ఫేం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. మంచి ఫీల్ ఉండే ట్యూన్స్ కంపోజ్ చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ సందర్భంగా విశ్వక్ సేన్, అర్జున్, రవి బస్రూర్ కలిసి దిగిన సెల్ఫీ స్టిల్ ఒకటి నెట్టింట్లో రౌండప్ చేస్తోంది.
ఈ చిత్రానికి పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా (Sai Madhav Burra) సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాతో ఐశ్వర్యా అర్జున్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతుంది. అర్జున్ హోంబ్యానర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్పై తెరకెక్కిస్తూ..స్వయంగా కథనందిస్తున్నాడు. అర్జున్ ఒకప్పటి కోస్టార్ జగపతిబాబు ఈ చిత్రంలో కీ రోల్లో నటిస్తున్నాడు. విశ్వక్ సేన్ నటిస్తోన్న మరో చిత్రం ధమ్కీ ఇటీవలే థాయ్‌లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

