నిఖిల్(Nikhil Siddharth) హీరోగా నటించిన కార్తికేయ మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇపుడు దీనికి సీక్వెల్ కార్తికేయ (Karthikeya 2) కూడా మరోసారి బాక్సాపీస్ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీనివాస్ రెడ్డి కీ రోల్ చేస్తున్నాడు.
కార్తికేయ 2 టీం రేపు ప్రపంచ ప్రఖ్యాత ISKCON ఆర్గనైజేషన్‌ను సందర్శించనుంది. యూపీలోని ఆర్గనైజేషన్‌ను సందర్శించి భగవాన్ శ్రీ కృష్ణ మహిమలు, జీవిత విశేషాలను స్పూర్తిగా తీసుకున్న అంశాలకు సంబంధించి భక్తులతో ముఖాముఖిలో పాల్గొనాలని కోల్‌కతా ISKCON వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ కార్తికేయ 2 టీంను ఆహ్వానించారు. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్ లో వీడియో ద్వారా షేర్ చేశాడు. అన్ని వెర్షన్ల టీజర్లను అక్కడ స్క్రీనింగ్ చేయనున్నట్టు చెప్పాడు నిఖిల్.
థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్‌ఖేర్, ఆదిత్యా మీనన్, హర్ష చెముడు కీ రోల్స్ పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్. కార్తికేయ 2ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.
3 Years of Blood Sweat and Much more… TRAILER OF #KARTHIKEYA2 is here….
Watch it and if u like it Please SHARE with ur friends and family …. #LordKrishna India’s Epic Mystical AdventureZee Cinemalu YouTube – https://t.co/9fYA4X0cHm pic.twitter.com/x0DcBSrIqn
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 24, 2022