ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పంజాబీ భామ (Punjabi actress) పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput ). ఈ సినిమాలో హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది పాయల్. ఆ తర్వాత తెలుగులో వెంకీ మామతోపాటు పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఏంజెల్, తెలుగులో కిరాతక (Kirataka )చిత్రాల్లో నటిస్తోంది. ఈ భామకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad)లో ఫ్లాట్‌లో అద్దెకుంటున్న పాయల్ రాజ్‌పుత్‌కు ఇక నుంచి ఆ బాధల నుంచి విముక్తి కలుగనుంది.
పాయల్ హైదరాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. పాయల్ ఈ పని కోసం తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ఢింగ్రా (Payal Rajput)సాయం తీసుకుందట. డెవలపర్స్ తో మాట్లాడటం, వారితో పేపర్ వర్క్స్ తోపాటు ఇతర పనులను సౌరభ్ చూసుకున్నాడట. షూటింగ్ తో తీరిక లేకుండా ఉండటంతో తన సామాగ్రిని పాత ఫ్లాట్ నుంచి కొత్త ఫ్లాట్‌కు మార్చిన తన సిబ్బందికి పాయల్ రాజ్‌పుత్ ధన్యవాదాలు తెలియజేసింది.
పాయల్ ఇప్పటివరకు పంజాబీ, హిందీ, తమిళ సినిమాల కంటే ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే కనిపించింది. పాయల్ రాజ్‌పుత్ భవిష్యత్‌లో హైదరాబాద్‌ను తన ఇల్లుగా మార్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని తాజా అప్డేట్ చూస్తే అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Divorce: విడాకులకి సిద్ధమవుతున్న మరో తెలుగు హీరో..నిజమెంత?
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు