అక్కినేని నాగ చైతన్య తాను పదేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతకు అక్టోబర్ 2న విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా వార్తలలో నలుగుతూనే ఉండగా, ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడనే వార్త దావానంలా మారింది. ఓ బిగ్ షాట్ కూతురిని వివాహం చేసుకున్న యంగ్ హీరో మనస్పర్ధల వలన విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడని సమాచారం
ఆ యువ హీరో ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి సెట్స్ పై వున్నాయి. అయితే వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన డిస్ట్రబెన్స్ కారణంగా ఆ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగులు సజావుగా సాగడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ హీరో ఈవెంట్స్‌లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు తన శ్రీమతితో కనిపించే ఆ హీరో ఈ మధ్య అస్సలు బయట కూడా కనిపించడమే మానేశాడు. యువ హీరో విడాకులపై ఫిల్మ్ ఇండస్ట్రీలో రక రకాలుగా వార్తలు పుట్టుకు రావడం మొదలైంది. ఇందులో నిజమెంత, ఆ యువ హీరో ఎవరు అని ఫిలిం నగర్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
ఇది కూడా చూడండి