Mega star chiranjeevi comments on maa elections result | తెలుగు ఇండస్ట్రీలో రసవత్తర పోరుకు తెరపడింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మంచు విష్ణు(manchu vishnu) గెలుపొందాడు. ఆదివారం రాత్రి మా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. పెళ్లి సందD ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న చిరు.. గత రెండు నెలలుగా ఇండస్ట్రీలో జరిగిన వివాదాలపై నోరు మెదిపాడు. అందరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
అల్లర్లతో మా పరువు తీయొద్దని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మా సభ్యులకు సూచించాడు. మనదంతా వసుదైక కుటుంబమని పేర్కొన్నారు. వివాదాలతో అందరి ముందు చులకన కావద్దన్నాడు. పదవులు తాత్కాలికమని.. చిన్న చిన్న పదవుల కోసం ఇగోలకు పోవద్దని సలహా ఇచ్చాడు. ఆధిపత్యం చూపించుకునేందుకు అవతల వారిని కించపరచొద్దని సూచించాడు. ఎవరి వల్ల ఈ వివాదాలు పుట్టాయో.. మూలాలకు వెళ్లి ఆలోచించాలన్నారు. అలా వివాదాలు పుట్టించే వ్యక్తులను దూరంగా పెట్టాలని సలహా ఇచ్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Manchu Vishnu | మంచు విష్ణుదే ‘మా’ అధ్యక్ష పీఠం
Tollywood | ఈ సారి మా ఎన్నికల్లో ఓటేయని స్టార్స్ వీళ్ళే..
Maa Elections 2021 | ‘మా’ ఎన్నికల్లో ఓటేసిన తారలు..ఎవరేమన్నారంటే..?
MAA Elections: శివ బాలాజీ చేయి కొరికిన హేమ.. ఏం జరిగిందో ఎలక్షన్ తర్వాత చెప్తానంటూ కామెంట్
Manchu vishnu | నాగబాబును అంకుల్ అంటూనే.. మంచు విష్ణు కౌంటర్