Manchu vishnu | నాగబాబును అంకుల్ అంటూనే.. మంచు విష్ణు కౌంటర్

Manchu vishnu | Maa elections | ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను మించిపోయాయని బయట అందరూ అనుకునే స్థాయిలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్‌లోని సభ్యులు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు మద్దతిచ్చిన మెగా బ్రదర్ నాగబాబు .. మంచు విష్ణుపై సీరియస్ అయ్యారు. విష్ణుపై చాలా ఆరోపణలు చేశాడు. అయితే వీటిపై తాజాగా స్పందించిన మంచు విష్ణు.. నాగబాబు కు కౌంటర్ వీడియో రిలీజ్ చేశాడు. ప్రత్యర్థి ప్యానెల్ సభ్యుల తీరుపై సీరియస్ అయ్యాడు. వ్యక్తిగతంగా దూషణలకు దిగిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు నాగబాబు మద్దతుగా మాట్లాడటంపై ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సారి మా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని మంచు విష్ణు వీడియోలో పేర్కొన్నాడు.. తాను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి ప్రత్యర్థి ప్యానెల్ అభ్యర్థులు తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఆ ప్యానెల్‌లోని సీనియర్ నటి కూడా వాళ్ల నాన్న మోహన్‌బాబుపై విమర్శలు చేశారని గుర్తు చేశాడు. ఎన్నికల్లో గెలిస్తే వందల కోట్లు, కిరీటాలు వచ్చేస్తాయా ఏంటి అని ప్రశ్నించాడు. తాను చేసిన ప్రతి పనిని తప్పంటూ చిల్లరగా మాట్లాడుతున్నారన్నాడు. వాళ్లంతా ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని అనుకున్నానని.. అయినా వాళ్ల మాటలు తనను ఎంతగానో బాధించాయని చెప్పుకొచ్చాడు. అక్కడ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న వ్యక్తి స్వార్థంతో పోటీ చేస్తున్నారని మంచు విష్ణు ఆరోపించారు. ఆ అభ్యర్థిని ఎవరు నిలబెట్టారో వాళ్ల తరఫున బయటకు వచ్చి మమ్మల్ని విపరీతంగా విమర్శిస్తున్నారు.. వ్యక్తిగతంగా దూషిస్తున్నారని నాగబాబు గురించి తెలిపారు. నాగబాబు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా మంచు విష్ణు స్పందించాడు. అంకుల్ నన్ను ఎందుకు విమర్శిస్తున్నారు. నేను చేసిన తప్పేంటి? మీ కళ్ల ముందే పెరిగాను కదా.. నేనేంటో మీకు తెలుసు కదా. మరి ఏం చేశానని నేనంటే మీకు అంత కోపం అని ఆవేదన వ్యక్తం చేశాడు మంచు విష్ణు. పవన్ కళ్యాణ్‌ను తిట్టిన వ్యక్తి ఇవాళ మీకు మేథావి అయిపోయాడా? అతనికంటే ఎందుకు నన్ను చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. మీ బిడ్డలాంటి నన్ను ఎందుకు అంతలా విమర్శిస్తున్నారని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబమంతా నాగబాబును గౌరవిస్తుందని అన్నారు. మీరంటే ఇష్టం కాబట్టే కౌంటర్ ఇవ్వడం లేదని చెప్పాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA Elections | ‘మా’ సభ్యులకు మోహన్‌బాబు వాయిస్ మెస్సేజ్
Manchu vishnu | విమానంలో వచ్చి మరి ఓటు వేసి వెళ్తారు.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Naga Babu: ఎన్నికల సిత్రం.. ప్రకాశ్ రాజ్‌ని విమర్శించిన ట్వీట్స్ తొలగించిన నాగబాబు
Maa elections | మా ఎన్నికలు జరుగుతున్న తీరుపై మెగాస్టార్ చిరంజీవి అసహనం..
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత.. మరి మోహన్ బాబును రాజశేఖర్ ఎందుకు కలిశారు? ఇదిగో క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

