మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..

Maa elections | మా అధ్యక్ష ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. మంచు విష్ణు ( Manchu vishnu ), ప్రకాశ్ రాజ్ ( prakash raj ) ప్యానెళ్ల సభ్యులు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. ఇవన్నీ చూసిన వారందరూ మా ఎలక్షన్స్.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య అంతలా వివాదాలు ముదురుతున్నాయి. ఈ క్రమంలో మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ( Sivaji Raja ) స్పందించారు. సీనియర్ నటుడు నరేశ్ ( Naresh )పై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ వివాదాలు సద్దుమణగాలంటే ఏం చేయాలో కూడా సలహా ఇచ్చారు.
తనకు తెలిసినంత వరకు మా అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. సభ్యులకు సేవ చేయాలనే ఆలోచనతోనే అందరూ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతుంటారని ఆయన అన్నారు. అలాగే ఈ సారి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్లు పోటీ పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అధ్యక్ష పీఠం అధిరోహించి సభ్యులకు సేవ చేయాలని ఇద్దరూ ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు మా అసోసియేషన్‌లో చాలా వివాదాలు జరుగుతున్నాయి. ఇన్ని గొడవలు జరగడానికి ప్రధాన కారణం నరేశ్ ( Naresh ) అని ఆరోపించారు. గత ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ఇవ్వకపోతే నరేశ్ విజయం సాధించేవాడు కాదని అన్నారు. అసలు నరేశ్‌కు నాగబాబు ఎందుకు మద్దతు ఇచ్చాడో కూడా ఇప్పటికీ తెలియదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ గొడవలు ఆగాలంటే ఏం చేయాలో సలహా కూడా ఇచ్చారు శివాజీ రాజా.
ముందుగా మా అధ్యక్షుడి పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు పెంచితే బాగుంటుందని శివాజీరాజా సూచించారు. అందుకు కారణం కూడా వివరించారు. రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, మోహన్‌బాబు ఈ ఐదుగురు.. సినీ పెద్దలను కూర్చోబెట్టి ఈ విషయంపై చర్చించాలన్నారు. అంతేకాకుండా ఈ నాలుగేళ్ల పదవీకాలంలో చెరో రెండేళ్లు అధ్యక్షపీఠం పంచుకోవాలని సలహా ఇచ్చారు. మొదటి రెండేళ్లు విష్ణు అధ్యక్షుడిగా.. ప్రకాశ్ రాజ్ జనరల్ సెక్రటరీగా.. ఆ తర్వాత రెండేళ్లు మంచు విష్ణు జనరల్ సెక్రటరీగా.. ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా పనిచేసేలా చర్చలు జరపాలని సూచించారు. ఇలా చేస్తే రెండు ప్యానెళ్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవని సలహా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA Elections | ‘మా’ సభ్యులకు మోహన్‌బాబు వాయిస్ మెస్సేజ్
Jeevitha | వాళ్లది తప్పైతే మాకు ఓటేయండి..మాది తప్పైతే చెప్పుతో కొట్టండి: జీవిత
Naga Babu: ఎన్నికల సిత్రం.. ప్రకాశ్ రాజ్‌ని విమర్శించిన ట్వీట్స్ తొలగించిన నాగబాబు
Maa elections | మా ఎన్నికలు జరుగుతున్న తీరుపై మెగాస్టార్ చిరంజీవి అసహనం..
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత.. మరి మోహన్ బాబును రాజశేఖర్ ఎందుకు కలిశారు? ఇదిగో క్లారిటీ
Nagendra Babu | నరేశ్ది నరం లేని నాలుక..అందరి కోసం ‘మా’ : నాగబాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

