Nagendra Babu | నరేశ్ది నరం లేని నాలుక..అందరి కోసం ‘మా’ : నాగబాబు
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల (Maa Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల (Maa Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మద్దతుగా నిలబడ్డ నటుడు, నిర్మాత నాగబాబు (Nagendra Babu) తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అభివృద్ది కోసం ప్రకాశ్ రాజ్ (Prakash Raj)కు మద్దతు ఇచ్చామని అన్నారు. ప్రకాశ్‌రాజ్‌కు పలువురితో పరిచయాలు ఉన్నాయి. ప్రకాశ్ రాజ్ హైదరాబాద్‌లో ఉంటాడు. మా అభివృద్ధి కోసం ప్రకాశ్ రాజ్ కృషి చేస్తారు. కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నారు. నరేశ్ (Naresh) రోజుకో మాట మారుస్తున్నారన్నారు.
మొదట్లో లోకల్, నాన్ లోకల్ అన్నారు. తర్వాత నరేశ్ మాట మార్చారు. నరేశ్ది నరం లేని నాలుక అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్ లోకల్ కానపుడు సభ్యత్వం ఎందుకు ఇచ్చారని నాగబాబు ప్రశ్నించారు. మా కోసం నరేశ్ చేసింది ఏమీ లేదన్నారు నాగబాబు. మాలో ఎవరైనా సభ్యులు కావొచ్చు. మా బైలాస్ ను విష్ణు మారుస్తారా..? లోకల్, నాన్ లోకల్ అనే మాట మంచిది కాదని సూచించారు. హైదరాబాద్ లో అందరూ అతిథులే. ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయినవారే. వీరందరినీ కేసీఆర్ చక్కగా చూసుకుంటున్నారు. మా అందరి కోసం ఏర్పడిందన్నారు.
ప్రకాశ్ రాజ్ తెలుగువాడు కాదనడం సరైంది కాదని నాగబాబు హెచ్చరించారు. విష్ణు ప్యానెల్ చీకటి యుగంలో బతుకుతుంది. మంచు విష్ణు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బీజేపీ అంటే నాకు అభిమానం. ప్రకాశ్ రాజ్ కమ్యూనిస్టు అని చెప్పుకొచ్చారు నాగబాబు.
ఇవి కూడా చదవండి..
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

