Jeevitha | వాళ్లది తప్పైతే మాకు ఓటేయండి..మాది తప్పైతే చెప్పుతో కొట్టండి: జీవిత
'మా' ఎన్నికల (Maa Elections) నేపథ్యంలో తాజాగా జరిగిన సమావేశంలో జీవిత (Jeevitha) మాట్లాడుతూ.. మీరు మంచి చేయండని చెప్పడానికి ఎందుకు లంచమివ్వాలని ప్రతిపక్ష ప్యానెల్ సభ్యులను ప్రశ్నించారు. మన మెంబర్స్ 920 మంది ఉన్నాం. ఈ మొత్తం మందికి కొంచెం ప్రశాంతత ఇవ్వండని సూచించారు.

ఎవరు ఎవరికైనా సపోర్ట్ చేయవచ్చు..ధర్మంగా పోరాడండి, న్యాయంగా పోరాడండి. ఇదంతా మన కుటుంబం. ఎందుకు బెదిరింపులు, ప్రలోభాలు. ఎందుకు తాయిలాలు.. అవసరం లేదు. మీరు మంచి చేయండని చెప్పడానికి ఎందుకు లంచమివ్వాలని జీవిత ప్రతిపక్ష ప్యానెల్ సభ్యులను ప్రశ్నించారు. ‘మా’ ఎన్నికల (Maa Elections) నేపథ్యంలో తాజాగా జరిగిన సమావేశంలో జీవిత (Jeevitha) మాట్లాడుతూ.. మంచి చేయాలని చెప్పడానికి ఎందుకు బెదిరించాలి. మన మెంబర్స్ 920 మంది ఉన్నాం. ఈ మొత్తం మందికి కొంచెం ప్రశాంతత ఇవ్వండని సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ కు 60 మంది దరఖాస్తులు పెట్టుకుంటే..ఫోన్ లో మాట్లాడితే మెంబర్స్ చెబుతున్నారు. అమ్మా భయమేస్తుంది మేం వేయగలమా..? మీకు. వచ్చి ఓటు వేయించుకుని తీసుకెళ్తారా..? అని అడుగుతున్నారు. 60 ఏళ్ల పైబడ్డ వారికి మనం ఏ విధంగా ధైర్యం ఇవ్వగలము. ప్రతీ సభ్యుడు ఓ సైనికుడిలా పోరాడాలని.. న్యాయానికి ఓటు వేయాలని జీవిత కోరారు.
వాళ్లంటే చాలా గౌరవముంది..
శివబాలాజీ, రాజీవ్ కనకాల మీద నాకు చాలా గౌరవముందని జీవిత తెలిపారు. నిన్న వారిని చూశాక షాకయ్యాను. శివబాలాజీ మంచి పని చేసే వ్యక్తి. నేను వాళ్లతో కలిసి పనిచేశాను. మంచి చేయండి, మంచి మాట్లాడండి, నిజం మాట్లాడండి. వాళ్లు మాట్లాడే ప్రతీ మాట తప్పు. ఏ విధంగా తప్పు అనేది నేను నిరూపించగలుగుతా. 100 మంది రండి నేను రోడ్డు మీద నిలబెట్టి నిరూపిస్తా. తప్పని రుజువైతే మా ప్యానెల్‌కు ఓటేయండి. మాది తప్పయితే చెప్పుతో కొట్టండి. అంతకన్నా నేనెక్కువ మాట్లాడదల్చుకోలేదని .
ఒక జయలలిత తమిళనాడులో సీఎంగా పాలించారు. ఆ తర్వాత ఎంజీఆర్, కరుణానిధి, నడిఘర్ సంఘంలో ఎలా అధ్యక్షుడయ్యారు. కళకు భాష, బేధమేంటి, ప్రాంతమేంటి..? ఇంకో గ్రహమని ఉంటే అక్కడికి కూడా వెళ్తాం. మన కళాకారులం. తొలిసారి ప్రకాశ్ రాజ్(Prakash Raj) ముందుకొచ్చి నేను మంచి చేస్తా అన్నారు. ఎందుకు మీరు బ్రాడ్ మైండ్ గా ఆలోచించి..ప్రకాశ్ రాజ్ కూడా మన వ్యక్తే కదా. ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి. అన్ని భాషల్లో నటించిన వ్యక్తి. మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఆయన ముందుకొచ్చి మంచి పని చేస్తానంటే స్వాగతం చెప్పాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Seetimaarr | ఓటీటీలో ‘సీటీమార్’ ఈల వేసేది అప్పుడే..!
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Chiranjeevi: కుటుంబంతో కలిసి ‘కొండ పొలం’ వీక్షించిన చిరంజీవి.. కామెంట్ ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

