Maa elections | మా ఎన్నికలు జరుగుతున్న తీరుపై మెగాస్టార్ చిరంజీవి అసహనం..

Maa elections | మా ఎన్నికలు ప్రశాంతంగా జరగడం అనేది జరగని పని. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా.. అక్కడ ఉన్న సభ్యులు ప్రశాంతంగా ఎన్నికలు చేసుకోవడానికి సహకరించరు అనేది బయట జరుగుతున్న వాదన. మీడియా ముందుకు వచ్చి తమ గురించి తామే డబ్బా కొట్టుకోవడంతో పాటు.. మిగిలిన వాళ్లపై విమర్శల వర్షం కురిపించడం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా అంతకుమించి గొప్పగా ఏం జరగలేదు. అక్టోబర్ 10న జరగబోయే ఈ ఎన్నికల కోసం నోటిఫికేషన్ రాకముందు నుంచే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు ప్రకాశ్ రాజ్ వర్గం.. మరొకవైపు మంచు విష్ణు వర్గం ఎవరికి ఎవరు తగ్గడం లేదు. మైక్ కనిపిస్తే చాలు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కొంత మంది సినీ పెద్దలకు మా ఎన్నికలపై పూర్తిగా ఆసక్తి పోయిందని తెలుస్తోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నాడు.
నిజానికి మెగాస్టార్ చిరంజీవి ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ను సపోర్ట్ చేస్తున్నాడు. ఇక మంచు విష్ణు ప్యానెల్‌కు బాలకృష్ణ, కృష్ణంరాజు లాంటి సీనియర హీరోల సపోర్ట్ ఉంది. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ రెండు వర్గాలు జారుతున్న మాటలను విన్న తర్వాత చిరంజీవి కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. మనలో మనకు జరిగే ఎన్నికల గురించి కూడా ఇంతగా విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ.. ఆయన రెండు వర్గాలపై కాస్త సీరియస్ అయినట్లు సమాచారం. అందుకే ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోవాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యాడు. కామ్ గా తన ఓటు వేసి మా అసోసియేషన్ గురించి ఏది పట్టించుకోకుండా కొన్ని రోజులు ఉండాలని చిరు ఆలోచిస్తున్నాడు. ప్రతిసారి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఇలా విమర్శలు చేసుకోవడం వల్ల పోయేది మన పరువే అని మా సభ్యులకు మెగాస్టార్ కాస్త గట్టిగానే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఉన్నది అందరూ మనవాళ్లే కాబట్టి నోరుజారి మాట్లాడొద్దని మెగాస్టార్ సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nagendra Babu | నరేశ్ది నరం లేని నాలుక..అందరి కోసం ‘మా’ : నాగబాబు
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత.. మరి మోహన్ బాబును రాజశేఖర్ ఎందుకు కలిశారు? ఇదిగో క్లారిటీ
Manchu Vishnu | మంచు విష్ణు రాజకీయ నాయకులను మించిపోయాడుగా..!
Hema | నాపై దుష్ప్రచారం..నరేశ్, కరాటే కల్యాణిపై హేమ ఫిర్యాదు
Maa elections | మా ఎన్నికలపై ఆ స్టార్ హీరోల అసంతృప్తి.. ఓటు వేయరా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

