Manchu Vishnu | మంచు విష్ణు రాజకీయ నాయకులను మించిపోయాడుగా..!
'మా' అసోషియేషన్ (Maa Elections) ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

‘మా’ అసోషియేషన్ (Maa Elections) ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తాను గెలిస్తే అసోసియేషన్‌కు ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాడు విష్ణు (Manchu Vishnu) . ప్రెస్ మీట్ పెట్టిన విష్ణు అక్కడ మాట్లాడుతూ.. మా భవనాన్ని తన సొంత డబ్బుతో కడతానని హామీ ఇచ్చారు.. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని.. భవిష్యత్తుతో అవసరాలు తీర్చేలా మా భవనం కడతామని క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు.
విష్ణు మేనిఫెస్టోలో ప్రధానాంశాలు ఓసారి చూద్దాం..
- మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artist Association)లో ఉన్న కొందరు సభ్యులు సినిమాల్లో నటించడానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.. ‘MAA App’ క్రియేట్ చేసి IMDB తరహాలో ప్రతి ఒక్క ‘మా’ సభ్యుల పోర్ట్ ఫోలియో క్రియేట్ చేస్తామని తెలిపాడు విష్ణు.. ‘MAA App’ నిర్మాతలకి, దర్శకులకి, రచయితలకి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌కి ఉండేలా చేస్తాం.. ‘జాబ్ కమిటీ’ నుంచి వారందరికీ సినిమాలు, ఓటిటి వంటి వివిధ మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పాడు ఈయన.
- తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టి పడేలా ‘మా’లో ఉన్న ప్రతి సభ్యుడికీ ఉపయోగపడే విధంగా ‘మా’ సొంత భవన నిర్మాణం.. అర్హులైన ‘మా’ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో సొంతింటి నిర్మాణం..
- ‘మా’ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు, కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్స్యూరెన్స్.. కార్పొరేట్ హాస్పిటల్స్‌తో అనుసంధానం.. ‘మా’ కుటుంబ సభ్యులందరికీ వైద్యం అందిస్తాం.. మూడు నెలలకు ఒకసారి ‘మా’ కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య శిబిరాలు.. ప్రతి ఒక్క ‘మా’ సభ్యుడికి ఉచితంగా ESI హెల్త్ కార్డు అందించే ఏర్పాటు.. ఇప్పటికే 946 మంది ‘మా’ సభ్యుల పేరు మీదున్న 3 లక్షల భీమా పెంపుదల..
- గెలిచిన వెంటనే పెన్షన్ల కోసం పెట్టుకుని ఉన్న దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారందరికీ ప్రతి నెలా పెన్షన్లు అందేలా ఏర్పాటు.. అలాగే 6,000/-లు ఉన్న పెన్షన్‌ను గణనీయంగా పెంచే ఏర్పాట్లు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రభుత్వపరంగా ఉన్న పెన్షన్ పథకాలు.. NBFCలో ఉన్న పథకాలు మన సభ్యులకు అందేలా ఏర్పాటు
- గౌరవ సభ్యత్వం ఇచ్చిన సీనియర్ సిటిజన్స్‌కి ఓటు హక్కు వచ్చేలా AGM లో ఆమోదం తెచ్చుకుని అమలు అయ్యేలా ఏర్పాటు..
- అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు KG to PG వరకు విద్యా సాయం.. అర్హులైన ‘మా’ సభ్యులకు ‘మా’ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షా పదహారు వేల ఆర్థిక సాయం.. ‘మా’ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ‘మా’ మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణ కోసం హై పవర్ కమిటీ ఏర్పాటు.. వయసుతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ (including single Mother and single Women) ఆర్థిక సాయం
- కరోనాతో కళాకారులందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు.. కమిటీ ఆమోదంతో ఆర్థికంగా వెనకపడ్డ యువతను ప్రోత్సహించడానికి కొంత కాల పరిమితి వరకు ‘మా’ మెంబర్షిప్ 75,000/- తగ్గించే ఏర్పాటు.. ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టడానికి ఒక Cultural and Finance Committee ఏర్పాటు.. సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు నిర్వహించి ‘మా’ని ఆర్థికంగా బలపరచడం..
- ‘మా’ ఎన్నికలలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులని కలుసుకుని వాళ్లతో సత్సంబంధాలు నెలకొల్పుకుని.. మన తెలుగు చలనచిత్ర సమస్యల పరిష్కారాలకి, దాని అభివృద్ధి ప్రణాళికలకు సంపూర్ణ సహాయసహకారాలను కోరడం..
- ‘మా’ సభ్యుల పిల్లలకు సినిమాలపై అభిరుచి ఉంటే మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌తో 50% స్కాలర్ షిప్‌తో శిక్షణ.. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్లోనూ తగినంత డిస్కౌంటు ఇప్పించే ప్రయత్నం
ఇవి కూడా చదవండి..
Samantha | అమ్మో సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
Tamannaah | అలా మారడం కష్టమైన పని : తమన్నా
Nagendra Babu | నరేశ్ది నరం లేని నాలుక..అందరి కోసం ‘మా’ : నాగబాబు
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

