టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ఈ ఏడాది చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం తెలుగులో ఎఫ్ 3 (F3) సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు మాస్టర్ చెఫ్ (MasterChef) షో కూడా చేస్తోంది. సత్యదేవ్ తో గుర్తుందా సీతాకాలంలో నటిస్తోంది. మరోవైపు హిందీలో దోస్త్ యార్ , ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాలు ఈ భామ ఖాతాలో ఉన్నాయి. సెట్స్ లో వాతావరణాన్ని చాలా ఎంజాయ్ చేస్తానంటోంది తమన్నా.
ఈ బ్యూటీ తాజా చిట్ చాట్ లో మాట్లాడుతూ…సెట్ లో ఉన్న హడావిడిని, ఒక సెట్ నుంచి వెంటనే మరో సెట్ కు మారడాన్ని ఎంజాయ్ చేస్తా. మిమ్మల్ని మీరు మానసికంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మారాలంటే చాలా కష్టం. ఎందుకంటే చేసే పాత్రలు, వాతావరణం, ఇతర విషయాలు కొత్తగా ఉంటాయి. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు స్క్రిప్ట్, పాత్రను అర్థం చేసుకునే ప్రక్రియ సినిమా చేసే పనిని సులభం చేస్తుందని చెప్పుకొచ్చింది తమన్నా.
తమన్నా, గోపీచంద్ తో కలిసి నటించిన సీటీమార్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు