మా అధ్యక్షుడిగా పోటీ చేయాలని అనుకున్నా.. కానీ ఆయన నా మనసు మార్చేశారు.. రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు

Rajasekhar on Maa elections | మా అధ్యక్ష ఎన్నికలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రకాశ్ రాజ్, విష్ణు ప్యానెళ్లలో ఏది గెలుస్తుందో అన్న ఉత్కంఠ సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రకాశ్ రాజ్ ( prakash raj ), మంచు విష్ణు ( Manchu vishnu ) ప్యానెళ్ల మధ్య వాడీ వేడీగా మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు ప్యానెళ్ల సభ్యులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. ఇంకా చెప్పాలంటే సాధారణ ఎన్నికలు తలపించేలా మా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయని అంతా అనుకుంటున్నారు. ఇంత ఉత్కంఠగా మారిన మా ఎన్నికల గురించి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా మా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని అనుకున్నట్లు చెప్పి షాకిచ్చాడు.
తెలుగు సినీ ఇండస్ట్రీ మరింత కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకోవాలంటే మా అసోసియేషన్‌కు తగిన అధ్యక్షుడు కావాలని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ అధ్యక్ష పీఠం పెత్తనం కోసం కాదని.. అదొక బాధ్యత అని చెప్పుకొచ్చారు. సభ్యుల సంక్షేమం, మా అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడే పదవి అని రాజశేఖర్ పేర్కొన్నారు. అందుకే తాను కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలోనే ప్రకాశ్ రాజ్ ( prakash raj ) తన ఇంటికి వచ్చారని.. మా అసోసియేషన్ సంక్షేమం కోసం ఏమేమి చేయాలని అనుకుంటున్నారో తనకు వివరించారని చెప్పాడు. ప్రకాశ్ రాజ్ ఆలోచనలు విన్న తర్వాత తన మనసు మార్చుకున్నా అన్నారు. మా అధ్యక్ష పదవికి ఆయనే తగిన వాడని అనిపించిందని.. అందుకే మా అధ్యక్షుడిగా పోటీ చేయాలన్న తన ఆలోచనను విరమించుకున్నానని చెప్పుకొచ్చాడు. మా అధ్యక్షుడి పదవికి ప్రకాశ్‌రాజ్ మాత్రమే పూర్తి న్యాయం చేయగలరని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అసోసియేషన్ అభివృద్ధికి చాలా డబ్బులు అవసరం అవుతాయని.. అందుకోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్‌కు వివిధ సినిమా ఇండస్ట్రీలతో సత్సంబంధాలు ఉన్నాయని కాబట్టి ఫండ్ రైజింగ్ కోసం ఆయన చాలా కార్యక్రమాలు నిర్వహించగలరని వివరించారు. అందుకే ప్రకాశ్ రాజ్ కు తన మద్దతు ప్రకటించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ పోటీ చేస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA Elections | ‘మా’ సభ్యులకు మోహన్‌బాబు వాయిస్ మెస్సేజ్
Jeevitha | వాళ్లది తప్పైతే మాకు ఓటేయండి..మాది తప్పైతే చెప్పుతో కొట్టండి: జీవిత రాజశేఖర్
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Naga Babu: ఎన్నికల సిత్రం.. ప్రకాశ్ రాజ్‌ని విమర్శించిన ట్వీట్స్ తొలగించిన నాగబాబు
Maa elections | మా ఎన్నికలు జరుగుతున్న తీరుపై మెగాస్టార్ చిరంజీవి అసహనం..
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత.. మరి మోహన్ బాబును రాజశేఖర్ ఎందుకు కలిశారు? ఇదిగో క్లారిటీ
Nagendra Babu | నరేశ్ది నరం లేని నాలుక..అందరి కోసం ‘మా’ : నాగబాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

