టాలీవుడ్ హీరోలు పవన్ కల్యాణ్-రానా కాంబోలో ప్రొడక్షన్ 12గా వస్తోన్న ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ రీస్టార్ట్ అయినట్టు తెలుపుతూ ఇప్పటికే విడుదల చేసిన పవన్ కల్యాణ్ బీమ్లా నాయక్ లుక్ కు అద్బుతమైన స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ మరో సర్ ప్రైజ్ వీడియోతో సినీ లవర్స్ ముందుకొచ్చారు. తాజాగా మేకింగ్ గ్లింప్స్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు.
లొకేషన్ లో త్రివిక్రమ్ రానాతో చర్చిస్తుండటం, పోలీస్ అధికారి బీమ్లా నాయక్ గెటప్ లో ఉన్న పవన్ నడుచుకుంటూ వస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ అండ్ సౌత్ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ను పనిచేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..