Kylian Mbappe : ఫిఫా వరల్డ్‌కప్‌లో కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) చరిత్ర సృష్టించాడు. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా ఈవెంట్లో గోల్డెన్ బూట్(Golden Boot) రేసులో దూసుకెళ్తున్న ఎంబాపే.. ఎనిమిదో గోల్ సాధించాడు. ప్రపంచకప్‌లో ఈ అతడికిది 20వ గోల్ కావడం విశేషం. తద్వారా 30 ఏళ్లలోపే ఈ మెగా టోర్నీలో 20 సార్లు బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపిన తొలి ఆటగాడిగా ఎంబాపే చరిత్రకెక్కాడు.
సాకర్ ఆటలో అతిపెద్ద పండుగైన ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే గోల్స్‌తో రెచ్చిపోతున్నాడు. గత సీజన్ రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ట్రోఫీ అందించాలనే కసితో ఉన్న ఎంబాపే.. ఎనిమిదో గోల్‌తో గోల్డెన్ బూట్ రేసులోకి దూసుకొచ్చాడు.
Mbappe! The upcoming legend!😍 pic.twitter.com/S4WMl5MeST
— Keh Ke Peheno (@coolfunnytshirt) July 10, 2026
క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై రెండో అర్ధ భాగంలో బంతిని ప్రత్యర్థి నెట్లోకి పంపిన ఫ్రాన్స్ కెప్టెన్.. ఈజిప్ట్‌పై గోల్‌తో టాప్‌లో కొనసాగుతున్న అర్జెంటీనా కెప్టెన్లి యోనల్ మెస్సీ(Lionel Messi)తో సమంగా నిలిచాడు. వరల్డ్‌కప్ అంటే చాలు చెలరేగిపోయే ఎంబాపే మొరాకోపై మెరుపు గోల్‌తో 30 ఏళ్లలోపే వరల్డ్‌కప్‌లో 20 గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగానూ రికార్డు సొంతం చేసుకున్నాడు. మెస్సీ కూడా 21 గోల్స్‌తో తాను తక్కువేమీ కాదని నిరూపించుకున్నాడు.
Kylian Mbappe opens the scoring! 💪🇫🇷
#FIFAWorldCup pic.twitter.com/AbdrR141dC
— FIFA World Cup (@FIFAWorldCup) July 9, 2026
గ్రూప్ దశలో – సెనెగల్పై- రెండు గోల్స్.
గ్రూప్ దశలో – ఇరాక్‌పై- రెండు గోల్స్.
32వ రౌండ్లో – స్వీడెన్పై – రెండు గోల్స్.
16వ రౌండ్లో – పరాగ్వేపై – ఒక గోల్.
క్వార్టర్ ఫైనల్లో – మొరాకోపై – ఒక గోల్.