రామగిరి, జూలై 10 : నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా అంశాలపై వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి 26 క్రీడా అంశాలకు సంబంధించిన స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్ను ఆమోదించారు. అలాగే విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన క్రీడా సౌకర్యాల కల్పన, అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూ, క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని తెలిపారు.
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో డాక్టర్ కె.హరీష్ కుమార్, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రెటరీ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంజీయూ, ప్రొఫెసర్ వసంత, డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, డాక్టర్ కె.అరుణ ప్రియ, సీహెచ్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ రవి నాయక్, వెంకటేశ్వర్లు, డాక్టర్ సంజయ్ సాహు, జానకిరామ్, ఫ్రాన్సిస్ రవీందర్, స్వప్న, డాక్టర్ రామావత్. మురళి, డాక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ బోర్డ్ కోఆర్డినేటర్ శివ శంకర్ పాల్గొన్నారు.