హనుమకొండ చౌరస్తా : ధూప, దీప, నైవేద్య అర్చకుల ( Temple Priests ) సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్, అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ ( Upendra Sharma ) కోరారు. హైదరాబాద్లో మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 6,540 దేవాలయాలలో ధూప,దీప, నైవేద్య అర్చకులు గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత అవసరం ఉన్నదని వివరించారు. గ్రామ రాజకీయాలతో వారు ఇబ్బంది పడుతున్నారన్నారు.
ధూప దీప నైవేద్య అర్చక స్కీంలో స్కీం అనే పదాన్ని తొలగించి, పూర్తిస్థాయి దేవదాయశాఖలో విలీనం చేసుకోని గ్రూప్ ఆఫ్ టెంపుల్స్గా గుర్తించాలని, 99 పీఆర్సీ వర్తింపజేయాలని సూచించారు. అర్చకులకు గౌరవ భృతి ప్రతినెల 5వ తేదీలోపే వచ్చేవిధంగా ఏర్పాటు చేయాలని కోరారు. అర్చకుల సమస్యలను క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో తీర్మానం పెడుతామని హామీ ఇచ్చారు.