హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీ పరిధిలో సేవలందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అద్దె బస్సు యజమానులను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది.
ఆర్టీసీలో అధికారులను మేనేజ్ చేయడానికి డబ్బు అవసరమని చెప్పి వారి నుంచి నగదు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఈ విషయంలో ఎవరూ మోసపోవద్దని, సంస్థ అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.