మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించండి
ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్య ఉన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం (మీడియేషన్) ద్వారా పరిషరించే అవకాశాన్ని పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర సర్కార్కు సూచించింది.
- రైస్ మిల్లర్ల వివాదంపై ప్రభుత్వానికి హైకోర్టు సూచన
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్య ఉన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం (మీడియేషన్) ద్వారా పరిషరించే అవకాశాన్ని పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర సర్కార్కు సూచించింది. 2022-23 యాసంగిలో అప్పగించిన ధాన్యానికి క్వింటాలుకు రూ.2,236.81 చెల్లించాలంటూ జారీచేసిన డిమాండ్ నోటీసులపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ సూచన చేసింది. ఈ అంశం పై ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. మే 8న జారీచేసిన జీవో నంబర్-7తోపాటు, దాని ఆధారంగా యాసంగికి సంబంధించిన ధాన్యంపై క్వింటాలుకు రూ.2,236.81 చొప్పున చెల్లించాలని కోరుతూ ఇచ్చిన డిమాండ్ నోటీసులను సవాలు చేస్తూ రైస్ మిల్లర్లు దాఖలు చేసిన 115కు పైగా పిటిషన్లపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డీ వెంకటరెడ్డి వాదనలు వినిపిస్తూ ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుండానే ప్రభుత్వం ధరను నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగడం తమ ఉద్దేశం కాదని, ఇరుపక్షాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిషరించాలని కోరారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, సుదీర్ఘ న్యాయపోరాటం కంటే మధ్యవర్తిత్వం ద్వారా పరిషారం లభిస్తే ఇరుపక్షాలకు సమ యం, వ్యయం ఆదా అవుతుందని, పరస్పర సంబంధాలు కూడా మెరుగుపడుతాయని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

