టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం సత్యాగ్రాహి (Satyagrahi). 2003లో ఘనంగా లాంఛ్ అయిన ఈ ప్రాజెక్టు అనూహ్యంగా అటకెక్కింది. 18 ఏండ్ల తర్వాత పవన్ కల్యాణ్ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు. మొదట లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు పవన్. జనసేన పార్టీపై జయప్రకాశ్ నారాయణ్ సిద్దాంతాల ప్రభావం ఉంటుందని ఈ సందర్భంగా పవన్ చెప్పారు.
అంతేకాదు జయప్రకాశ్ నారాయణ్ (Lokanayak Jayaprakash Narayan) ఎమెర్జెన్సీ ఉద్యమం సమకాలీన పరిస్థితుల స్ఫూర్తిగా పొలిటికల్ ఫిల్మ్‌గా సత్యాగ్రాహిని తీయాలని సంకల్పించినట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం కంటే దాని గురించి మాట్లాడుతూ, ఆ అడుగుజాడల్లో నడవడం చాలా సంతృప్తినిస్తుందని తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత సత్యాగ్రాహి సినిమాను గుర్తు చేస్తూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు.
A political film inspired by Loknayak ‘Jayaprakash Narayan’s ‘ Emergency movement in the contemporary times. Did the film opening in 2003( I think) and shelved it to do it in real life. It’s more satisfying to walk the talk rather than to act it out in a film. pic.twitter.com/LXCpzaKlYX
— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2021
పాన్ ఇండియా కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Divorce: విడాకులకి సిద్ధమవుతున్న మరో తెలుగు హీరో..నిజమెంత?
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు