Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘AA22xA6’ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ జానర్లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, దీనిపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా గురించి చిన్న అప్డేట్ బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరో ముగ్గురు కథానాయికలు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది
జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన పేర్లు ప్రముఖంగా వినిపించగా, ఇప్పుడు రష్మిక మందన నిజంగానే షూటింగ్లో జాయిన్ అయిందన్న వార్త మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్లో రష్మిక పాల్గొంటోందని, అల్లు అర్జున్, జాన్వీ కపూర్, ‘కుబేర’ ఫేమ్ జిమ్ సర్భ్‌లతో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తోందని ఓ ఆంగ్ల మీడియా ఛానల్ వెల్లడించింది. దాదాపు నెల రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ, యోగిబాబు వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి వార్తలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో ఈ మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. ‘పుష్ప’ సిరీస్‌లో అల్లు అర్జున్ – రష్మిక జంట బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వడంతో ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఈ చిత్రంలో రష్మిక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందన్న రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆమె కెరీర్లో చేయని సరికొత్త పాత్రలో, ఛాలెంజింగ్ రోల్లో కనిపించనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘AA22xA6’ సినిమా ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కుతుండగా, అల్లు అర్జున్ మల్టిపుల్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు లాస్ ఏంజిల్స్‌కు చెందిన ప్రముఖ VFX కంపెనీలు పని చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియో సినిమా స్థాయిని సూచించగా, ఈ చిత్రం 2027లో వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుందని తెలుస్తోంది.