ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 11:29:54

మ‌ల‌యాళ రీమేక్ మొద‌లు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

మ‌ల‌యాళ రీమేక్ మొద‌లు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

సెకండ్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌న్ త‌న జోరు కొన‌సాగిస్తున్నాడు. రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటూనే మ‌ధ్య మ‌ధ్య‌లో తాను క‌మిట్ అయిన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ చిత్ర షూటింగ్ పూర్తి చేయ‌గా, ఈ చిత్రం మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్తైన త‌ర్వాత క్రిష్ సినిమాను మొద‌లు పెట్టిన ప‌వ‌న్ తాజాగా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ స్టార్ట్ చేశాడు.

బిజూ మీన‌న్, పృథ్వీ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన మ‌ల‌యాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె చంద్ర‌. త్రివిక్ర‌మ్ చిత్రానికి మాట‌లు అందిస్తున్నారు. నేటి నుండి ఈ చిత్రం నాన్ స్టాప్‌గా అల్యూమినియం ఫ్యాక్టరీలో  జ‌ర‌గ‌నుంది. రానా, పవన్ కళ్యాణ్‌లపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.  ఈ మూవీని కూడా 2021లో విడుద‌ల చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

VIDEOS

logo