Pawan Kalyan | ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలు (AP Floods) విజయవాడతోపాటు పలు ప్రాంతాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వరదలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ముంపునకు గురైన బాధితుల సహాయార్థం ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ వంతుగా భారీగా విరాళాలు ప్రకటించారు.
తాజాగా జెట్టీ ఫేం యాక్టర్ కృష్ణ మణినేని తన వంతుగా సహకారం అందించేందుకు ముందుకొచ్చాడు. కృష్ణ తన ఛారిటబుల్ ట్రస్ట్ 100 Dreams Foundation ద్వారా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందించాడు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటుడు కృష్ణతో సమావేశమయ్యారు.
ఎనిమిదేండ్లుగా ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. కృష్ణకు అభినందనలు తెలియజేశారు. తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృష్ణకు సహకరించాలని పవన్ కల్యాణ్ ప్రజలు, అభిమానులను కోరారు.
Bad Newz | తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూజ్ను ఇక ఉచితంగా చూసేయొచ్చు.. ప్లాట్‌ఫాం ఇదే
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?