Pawan Kalyan | సినిమాల విషయంలో పవన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక నిర్మాతలు తికమక పడుతున్నారు. ఆయనతో జర్నీ అంటే ఇలాగే ఉంటుందని తెలిసినా కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఇకపై అన్ని కార్యకలాపాలు జరుగుతాయంటూ ఇప్పటికే పవన్ అనౌన్స్ చేశాడు. దాంతో ఆయన సినిమాల కార్యకలాపాలు కూడా అక్కడి నుంచే జరుగుతాయని ఇన్‌డైరెక్ట్ గా చెప్పేశాడు. దానికి నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉన్నారు. పవన్ ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ సెట్లు వేసి షూటింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే బ్రో సినిమా విడుదలకు ముందు ఎలక్షన్స్ ముందు ఇదే చివరి సినిమా అనుకున్నారంతా. ఈ సినిమా తర్వాత పూర్తిస్థాయిలో జనాల్లోకి వెళ్లి తన పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని జనసేనాని భావించాడు. అయితే బ్రో విడుదలైన తర్వాత పొలిటికల్‌గా ఈ సినిమా చేస్తున్న సౌండింగ్ చూసి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఎలాగూ ఎన్నికలకు ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు మరో రెండు సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడు పవర్ స్టార్. అందుకే మొన్న జులై 31న హరీశ్ శంకర్ మంగళగిరికి వెళ్లి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలిసి వచ్చాడు. ఆ భేటీలో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. కేవలం మూడు అంటే మూడు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు హరీశ్‌కు పవన్ సూచించినట్టు తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో ఓజీకి 15 రోజులు డేట్స్ ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్. దాంతో ఆ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. కచ్చితంగా ఎలక్షన్స్ లోపు ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలనేది పవన్ కళ్యాణ్ ప్రణాళిక పెట్టుకున్నాడు.
అన్నింటికంటే ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ తన పొలిటికల్ సెటైర్‌గా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు పవర్ స్టార్. అందులో కావాల్సినన్ని రాజకీయ వ్యంగ్యాస్త్రాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. హరీశ్ కూడా ఈ స్క్రిప్ట్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశాడు. అందుకే వచ్చే ఎన్నికలకు ఈ సినిమాను ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏదేమైనా ఈయన యూటర్న్ తీసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది కానీ.. దర్శక నిర్మాతలు మాత్రం సంతోషంలో ముంచేత్తేలా చేస్తుంది. మరి ఈ ఆనందం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.
Janasena Party | ఆ లెజెండరీ కమెడియన్ జనసేన పార్టీలో చేరబోతున్నాడా..?
Baby Movie Collections | బేబీ సినిమాకు 100 కోట్లు వస్తాయా.. మేకర్స్ మాస్టర్ ప్లాన్..?