ముంబై : ది కేరళ స్టోరీ మూవీతో ప్రాచుర్యం పొందిన నటి ఆదా శర్మ అస్వస్ధతకు లోనవడంతో బుధవారం ఆస్పత్రిలో (Adah Sharma Hospitalised )చేరారు. తన అప్‌కమింగ్ షో కమాండో ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొనే ముందు ఆమె అనారోగ్యానికి లోనయ్యారు.
తీవ్ర డయేరియా, ఫుడ్ అలర్జీతో ఆమె బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆదా శర్మ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని సమాచారం.
ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొనే ముందు ఆమె వాంతులతో బాధపడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. కమాండోలో భావనా రెడ్డి పాత్ర పోషించిన ఆదా శర్మ ప్రస్తుతం ఆ షో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
Read More :