Baby Movie Collections | బేబీ సినిమాకు 100 కోట్లు వస్తాయా.. మేకర్స్ మాస్టర్ ప్లాన్..?
Baby Movie Collections | ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలో సంచలనం అంటే మరో అనుమానం లేకుండా ఎవరైనా బేబీ పేరు చెప్తారు. ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికి దీనికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
Baby Movie Collections | ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలో సంచలనం అంటే మరో అనుమానం లేకుండా ఎవరైనా బేబీ పేరు చెప్తారు. ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికి దీనికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా విడుదలైన తర్వాత కూడా బేబీ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. మూడో వీకెండ్ కూడా ఉన్న థియేటర్స్ లో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అయింది. ఈ సినిమా బ్రో కోసం చాలా థియేటర్లు త్యాగం చేసింది బేబీ టీమ్. అయితే నాలుగో రోజు బ్రో సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోవడం కూడా బేబీకి కలిసి వస్తుంది.
ఈ సినిమా కంటెంట్ కు యువత బాగా కనెక్ట్ అయింది. అందుకే ఇప్పటికీ కలెక్షన్స్ ఆగడం లేదు. అయితే ఇప్పుడు అందరికీ ఒకటే అనుమానం ఉంది.. బేబీ 100 కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా అని ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. నిజంగా అది జరిగితే మాత్రం అంతకంటే అద్భుతం మరొకటి ఉండదు. ఎందుకంటే కనీసం 40 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనుకున్న సినిమా 100 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్ ఇలాంటి నటులు చేసిన సినిమా 100 కోట్ల వరకు ప్రయాణం సాగించడం అంటే నిజంగా అది ఒక అద్భుతం. కొన్నేళ్ళలో ఇలాంటి అద్భుతం మరో సినిమాకు సాధ్యం కాలేదని చెప్పాలి. నాలుగో వారం కూడా తమ సినిమాకు కలెక్షన్స్ రావాలని బేబీ టీం సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. అది గాని వర్కౌట్ అయిందంటే సినిమాకు ఈజీగా 100 కోట్లు వస్తాయి.
పైగా ఈ వారం కొత్త సినిమాలు ఏమీ లేవు. అన్నింటికీ మించి బ్రో సినిమాకు కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు. దాంతో థియేటర్స్ చాలా వరకు బేబీతో నింపాలని చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇవన్నీ ఇలా ఉండగానే ఆల్రెడీ మూడు గంటలు ఉన్న సినిమాకు మరో 15 నిమిషాల ఆధారంగా జత చేయాలని నిర్ణయించుకున్నారు దర్శక నిర్మాతలు. అందులో ఒక పాటతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కచ్చితంగా ఈ సీన్స్ తో రిపీట్ ఆడియన్స్ వస్తారని నమ్ముతున్నారు బేబీ మేకర్స్. ఒకవేళ ఈ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. చూడాలి మరి వాళ్ల ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అంతేకాదు బేబీ సినిమాకు మరొక భారీ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే మూడు సక్సెస్ మీట్ లు పెట్టారు. ఈ సారి వాటన్నింటికీ మించి పెద్దది చేయాలని భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

